ETV Bharat / sitara

కంగనకు ఆలియా కౌంటర్​ ఇదేనా? - kangana, alia bhatt war on nepotism

సుశాంత్​ రాజ్​పుత్ మృతితో బాలీవుడ్​లో చెలరేగిన బంధుప్రీతి వివాదం నేపథ్యంలో.. ప్రముఖ హీరోయిన్లు కంగనా రనౌత్​, ఆలియా భట్​లు సామాజిక మాధ్యమాల వేదికగా మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరిపేరు ప్రస్థావించకుండా ఆలియా గట్టి కౌంటర్​ ఇచ్చింది.

Alia hits back at Kangana with latest post?
కంగనా, ఆలియా
author img

By

Published : Jul 20, 2020, 6:14 AM IST

Updated : Jul 20, 2020, 7:38 AM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్యతో సామాజిక మాధ్యమాల వేదికగా బంధుప్రీతి చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్లు కంగనా రనౌత్, ఆలియా భట్​ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా, తనను లక్ష్యంగా చేసుకొని కంగన చేసిన వ్యాఖ్యలకు.. ఎవరిపేరు ప్రస్థావించకుండా ధీటుగా బదులిచ్చింది ఆలియా. నిజాలు, అబద్దాల మధ్య తేడా గురించి ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది.

"ఎవ్వరు నమ్మకపోయినా నిజం ఎప్పటికీ నిజమే. అందరూ నమ్మినా అబద్దం ఎల్లప్పుడూ అబద్దమే" అనే సారాంశంతో ఓ పోస్ట్ పెట్టింది.

Alia hits back at Kangana with latest post?
ఆలియా పోస్ట్​

ఇటీవలే 'కాఫీ విత్​ కరణ్'​ షోలో సుశాంత్​ గురించి ఆలియా మాట్లాడినప్పటి వీడియోను పోస్ట్​ చేస్తూ.. కంగన విమర్శించింది. అందులో మీరు చంపాలనుకుంటే వీరిలో ఎవరిని ఎంచుకుంటారని ఆప్షన్​ ఇవ్వగా.. సుశాంత్​ పేరు చెప్పింది ఆలియా.

జూన్​ 14న సుశాంత్​ ఆత్మహత్యతో బాలీవుడ్​ పరిశ్రమలో నెపోటిజంపై అగ్గి రాజేసుకుంది. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాత మహేశ్​ భట్​, కుమార్తెలు పూజా భట్​, ఆలియా భట్ తదితరులు సోషల్​ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Last Updated : Jul 20, 2020, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.