ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' భామ ఆలియా భట్​కు కరోనా - ఆలియా భట్ కరోనా

బాలీవుడ్ నటి ఆలియా భట్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నట్లు తెలిపింది.

Alia Bhatt tests positive for COVID-19
బాలీవుడ్​ నటి ఆలియా భట్​కు కరోనా
author img

By

Published : Apr 2, 2021, 7:20 AM IST

Updated : Apr 2, 2021, 11:50 AM IST

బాలీవుడ్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు వైరస్​ బారినపడగా.. తాజాగా నటి ఆలియా భట్​కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపింది.

కొద్దిరోజుల క్రితం ఆలియా బాయ్​ఫ్రెండ్ రణ్​బీర్ కపూర్​ కరోనా బారినపడ్డాడు. అప్పుడు కూడా ఆమె పరీక్షలు చేయించుకోగా నెగిటివ్​గా తేలింది. తాజాగా మరోసారి చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

Alia Bhatt tests positive for COVID-19
ఆలియా భట్ ఇన్​స్టా స్టోరీ

"హాయ్ ఆల్.. నాకు కరోనా పరీక్షల్లో పాజిటివ్​గా తేలింది. వెంటనే నేను స్వీయనిర్భంధంలోకి వెళ్లా. డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు. అందరూ జాగ్రత్తగా ఉండండి" అంటూ ఇన్​స్టాలో పోస్ట్ పెట్టింది ఆలియా.

ఆలియా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్​'లో నటిస్తోంది. రామ్​చరణ్​, తారక్ హీరోలు. అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయ్ కతియావాడి', అయాన్ ముఖర్జీ దర్శకత్వంలోబ్రహ్మాస్త్ర' చేస్తోంది. ఇందులో రణ్​బీర్ కపూర్ హీరో. అమితాబ్, నాగార్జున కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Alia
ఆలియా

Last Updated : Apr 2, 2021, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.