Gangubai new release date: ఒమిక్రాన్ ఎఫెక్ట్ మరో సినిమాపై పడింది. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'గంగూబాయ్ కతియావాడి' మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
నిజ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమాలో గంగూబాయ్ అనే వేశ్యగృహం యజమానిగా ఆలియా నటించింది. అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్ర పోషించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమాను తొలుత జనవరి 7న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ 'ఆర్ఆర్ఆర్' పోటీ ఉండకూడదని చెప్పి, పక్కకు తప్పుకొన్నారు. ఫిబ్రవరి 18న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఇప్పుడు మరో వారం ముందుకు జరిగి ఫిబ్రవరి 25న ప్రేక్షకులను పలకరిస్తామని స్పష్టం చేశారు.
Sri vishnu bhala thandanana teaser: శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'భళా తందనాన'. ఈ చిత్ర టీజర్‌ను హీరో నాని, శుక్రవారం రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటూ, సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
ఇందులో శ్రీవిష్ణు సరసన కేథరిన్ హీరోయిన్గా నటించింది. మణిశర్మ సంగీతమందించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: