'ఫిదా' సినిమా మొదట మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌లకు చెప్పానని క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. తాజాగా ఆయన ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చిరంజీవి 'శంకర్‌దాదా' విడుదలైన సమయంలోనే తన 'ఆనంద్' కూడా విడుదలైందని చెప్పారు. ఒక హోటల్‌లో పది మంది కుర్రాళ్లు పుట్టినరోజు వేడుక చేసుకుంటే వాళ్లకు సినిమా చూపిస్తానని చెప్పి, 'ఆనంద్'కు తీసుకెళ్లానని వివరించారు.
తన చిత్రాల్లో బ్రహ్మానందం, ఆలీలాంటి కమెడియన్లు ఉంటే బాగుంటుందని ఇంట్లో వాళ్లు అంటుంటారని వివరించిన శేఖర్ కమ్ముల 'సారంగదరియా' పాట విషయంలో జరిగిన వివాదంపై భావోద్వేగానికి గురయ్యారు. ఇంకా ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 12వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే! అప్పటి వరకూ ఈ ఆసక్తికర ప్రోమో చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'పూరీ జగన్నాథ్ సినిమా ఎప్పుడు తీయాలో చెప్పా!'