ETV Bharat / sitara

ముమైత్​ఖాన్ అందుకున్న​ తొలి జీతం ఎంతంటే? - ఆలీతో సరదాగా ముమైత్​ ఖాన్​

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన నటి, డ్యాన్సర్​ ముమైత్​ ఖాన్.. తాను అందుకున్న తొలి జీతం, డ్యాన్సర్​గా తొలి అవకాశం ఎలా వచ్చింది? సహా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి మీకోసం..

mumaith
ముమైత్​
author img

By

Published : Feb 23, 2021, 12:07 PM IST

తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే ఓ పాటకు కొరియోగ్రఫీ చేశానని తెలిపారు నటి​ ముమైత్​ ఖాన్​. చిన్నప్పటి నుంచి టీవీ చూస్తూనే డ్యాన్స్​ నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే సెలిబ్రిటీ టాక్‌ షో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ముమైత్ ఎన్నో విషయాలు పంచుకున్నారు.

ఇండియన్​ షకీలాగా పేరు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ తన గురువు.. దర్శకుడు రెమో అని అన్నారు. ఆయన కొరియోగ్రాఫీ​ చేసిన ఓ పాటలో బ్యాక్​గ్రౌండ్​ డ్యాన్సర్​గా తొలి అవకాశం వచ్చిందని చెప్పారు. అప్పుడు తాను అందుకున్న జీతం రూ.750 అని తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంజయ్​దత్​ నటించిన 'మున్నాభాయ్​ ఎమ్​బీబీఎస్'​ సినిమాలో 'దేఖ్​ లే మున్నాభాయ్'​ పాటకు తొలిసారి మెయిన్​ డ్యాన్సర్​గా కనిపించారు ముమైత్​. అయితే ఈ ఆఫర్​ వచ్చినప్పుడు తనకు అంతగా ఎక్సైట్​మెంట్​ లేదని అన్నారు. తన ఉత్సాహం​ అంతా ఈ పాటకు అందుకున్న రెమ్యునరేషన్( రూ.30వేలు)పైనే ఉందని చెప్పారు. తానెప్పుడు పాపులారిటి కోసం కాకుండా కష్టపడి మాత్రమే పనిచేసినట్లు తెలిపారు. అలానే స్టార్‌డమ్‌ వచ్చిన తరువాత తనకేమీ కొమ్ములు రాలేదని వెల్లడించారు.

ఇదీ చూడండి: 15 రోజులు కోమాలో ఉన్నా: ముమైత్‌ఖాన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.