"కెరీర్ ప్రారంభంలో టాప్ దర్శకులతో సినిమా చేస్తేనే బాగుంటుందని అనుకునేవాణ్ని. తర్వాత పరిస్థితి అర్థమైంది" అంటూ కథానాయకుడు శ్రీ విష్ణు తన సినీ ప్రయాణం గురించి చెప్పారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి శ్రీ విష్ణు, దర్శకుడు అనిల్ రావిపూడి అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో తనకు ప్రోత్సాహం అందించిన నటులు, హీరో కాకముందు ఏం చేశారు, ఎక్కువ సార్లు చూసిన సినిమా, నిర్మాతగా తన భార్య ఏ చిత్రాలు రూపొందించారు తదితర విషయాలు వెల్లడించారు విష్ణు.
కాగా, రచయితగా తొలిసారి ఏ సినిమాకు పనిచేశారు, 'గాలి సంపత్' చిత్రానికి ఆ పేరేందుకు పెట్టారో వివరించారు అనిల్ రావిపూడి. శ్రీ విష్ణును అడిగే ప్రశ్నలకు అనిల్ చెప్పే సమాధానాలు నవ్వులు పూయిస్తున్నాయి.
సినీ రంగంలో ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగింది? శ్రీ విష్ణు వివాహం ఎలా జరిగింది? తెలుసుకోవాలని ఉందా.. అయితే నేడు(సోమవారం) రాత్రి 9:30గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందే. మరి ఈలోగా అలీతో సరదాగా లేటెస్ట్ ప్రోమోను చూసేయండి!
ఇదీ చూడండి: ఖరీదైన విల్లా కొన్న దర్శకుడు అనిల్ రావిపూడి!