ETV Bharat / sitara

ఈ బాలీవుడ్​ ప్రేమ జంట వివాహం వచ్చే ఏడాదిలోనే! - ali fazal latest news updates

ఈ ఏడాది ఏప్రిల్​లో బాలీవుడ్​ ప్రేమ జంట రిచా చద్దా, అలీ ఫజల్​ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ కరోనా కారణంగా ఈ పెళ్లి నిలిచిపోయింది. తాజాగా వచ్చే ఏడాదిలో తాము వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

Ali Fazal and Richa Chadha postpone their marriage to 2021
రిచా చధా, అలీ ఫజల్​
author img

By

Published : Aug 4, 2020, 3:21 PM IST

Updated : Aug 4, 2020, 4:13 PM IST

బాలీవుడ్​ నటులు రిచా చద్దా, అలీ ఫజల్​ ఈ ఏడాది ఏప్రిల్​లో మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాల్సింది. అయితే కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది డిసెంబరులో వీరిద్దరూ వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా, ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన అలీ, రిచా.. ఈ ఉహాగానాలకు తెరదించారు. వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

Ali Fazal and Richa Chadha postpone their marriage to 2021
రిచా, అలీ ఫజల్​

చాలా మంది ఈ వివాహానికి హాజరు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు రిచా తెలిపింది. ఇప్పటికే ముంబయి, లఖ్​నవూ, దిల్లీ నగరాల్లో వివాహ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. మహమ్మారి కారణంగా అన్ని కార్యకలాపాలను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, జరిగిందంతా తమ మంచికేనని.. అలీ తెలిపాడు.

2012లో ఓ సినిమా షూటింగ్​లో అలీ, రిచాల మధ్య స్నేహం చిగురించింది. 2015లో ప్రేమలో పడినప్పటికీ.. 2017లో అభిమానులకు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో మాల్దీవుల్లో రిచాకు అలీ మ్యారేజ్​ ప్రపోజ్​ చేశాడు. దీంతో ఈ జంట వివాహానికి సిద్ధమైంది.

Last Updated : Aug 4, 2020, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.