బన్నీ గత చిత్రాలకు భిన్నంగా 'అల... వైకుంఠపురంలో' సినిమా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, ప్రోమోలు సహా 'సామజవరగమన, 'రాములో రాములా' పాటలతో మరింత జోరు పెంచారు. తాజాగా మూడో పాట 'ఓ మై గాడ్ డాడీ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. దీన్ని వీడియో, లిరిక్స్ మిక్స్ చేసి... ర్యాప్ తరహాలో అద్భుతంగా రూపొందించాడు సంగీత దర్శకుడు తమన్. దీన్ని రాహుల్ సిప్లింగంజ్ పాడగా... రోల్‌రైడా, రాహుల్ నంబియార్, లేడీ కాశ్, బ్లేజ్ కలిసి కోరస్ అందించారు. ఈ పాటలో చిత్రబృందంలోని ప్రముఖుల రియల్ నాన్నలను చూపించడం విశేషం.
బన్నీ 19వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో ఈ స్టార్హీరో 'బంటు' పేరున్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, సునీల్ తదితరులు నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">