స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'.. ఆదివారమే థియేటర్లలోకి వచ్చింది. అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. అయితే తొలిరోజే రూ.85 కోట్లు గ్రాస్ వసూలు చేసిందంటూ ఓ పోస్టర్.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రాకపోవడం వల్ల ఇది అసత్యమేనని(ఫేక్) పలువురు నెటిజన్లు అంటున్నారు.
అంతకు ముందు వచ్చిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర.. ఈవిషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం.. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల గురించి కాకుండా, కలెక్షన్ల కోసం మాట్లాడుకుంటున్నారు. మరికొద్ది రోజుల వరకు ఇది ఆగేలా లేదు.
ఇవీ చదవండి: