మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మార్కు డైలాగ్స్‌తో పాటు.. నేటివీటి తగ్గ పాటలతో మెప్పిస్తున్నాడు. ఇప్పటికే ఆయన దర్శకత్వం వహించిన 'అత్తారింటికి దారేది' సినిమాలోని 'కాటమరాయుడా' సాంగ్, 'అజ్ఞాతవాసి' సినిమాలోని 'కొడకా కోటేశ్వరరావా', అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి లాంటి పాటలు జానపదాలను గుర్తు చేసి.. ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తాజాగా అల్లు అర్జున్ నటించిన‘అల..వైకుంఠపురములో..’ సినిమాలో 'సిత్తరాల సిరపడు' అనే పాట ఓ సంచలనం సృష్టించింది.
చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్‌కు శ్రీకాకుళం జానపద గేయం 'సిత్తరాల సిరపడు'ను జోడించి బన్నీ ఫ్యాన్స్‌కు బహుమతిగా అందించాడు త్రివిక్రమ్. ఈ పాట ఫైట్‌కు థియేటర్లలో ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. విడుదలకు ముందు ఈ పాట వివరాలను దాచిపెట్టిన త్రివిక్రమ్, అల్లు అర్జున్ ... ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుంచి వస్తున్న స్పందన చూసి ప్రత్యేకంగా లిరికల్ వీడియో విడుదల చేశారు.
తమన్ స్వరకల్పనలో ఈ పాటను విజయ్ కుమార్ అనే లెక్చరర్ రాయగా.. సూరన్న, సాంకేత్‌లు పాడి ఆలపించారు. 'అల.. వైకుంఠపురములో'ని 'సామజవరగమన', 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' పాటల తరహాలో 'సిత్తరాల సిరపడు' కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని నెటిజన్లు అనుకుంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: 'అల వైకుంఠపురములో' కలెక్షన్లు, లైక్‌ల జోరు