బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' చిత్రబృందం అద్భుతమే చేసింది. లాక్డౌన్లోనే షూటింగ్ ప్రారంభించి, పూర్తి చేసిన తొలి సినిమాగా ఘనత సాధించింది. మొత్తం షెడ్యూల్ స్కాట్లాండ్లోనే జరిగింది.
ప్రతిఒక్కరి కృషితోనే సాధ్యమైందని, వారితో కలిసి పనిచేయడం నిజంగా తన అదృష్టమని అక్షయ్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులు మనం ఊహించని విధంగా ఉన్నాయని, అందుకు అనుగుణంగానే మనం పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
ఆగస్టు తొలి వారంలో ప్రత్యేక విమానాల్లో ఆ దేశానికి వెళ్లిన చిత్ర యూనిట్.. అప్పటినుంచి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ముగించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ సహా విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న థియేటర్లలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.