ETV Bharat / sitara

అక్షయ్ 'పృథ్వీరాజ్' చిత్రీకరణ​ పునఃప్రారంభం - అక్షయ్​కుమార్​

బాలీవుడ్ హీరో అక్షయ్​కుమార్​ నటిస్తున్న 'పృథ్వీరాజ్​' చిత్రీకరణ తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు చంద్రప్రకాశ్​ ద్వివేది వెల్లడించారు.

akshay
అక్షయ్
author img

By

Published : Oct 12, 2020, 5:57 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ నటిస్తోన్న 'పృథ్వీరాజ్' సినిమా చిత్రీకరణ పునఃప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు చంద్రప్రకాశ్​ ద్వివేది స్పష్టం చేశారు. చిత్రీకరణ తిరిగి ప్రారంభమవ్వడం సంతోషంగా ఉందన్నారు.

అయితే అక్టోబర్​ 10వ తేదీనే షూటింగ్​ తిరిగి ప్రారంభించినట్లు చిత్రబృందానికి సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోన్న సోనూసూద్​ కూడా షూటింగ్​లో పాల్గొన్నట్లు చెప్పారు. కథానాయిక మానుషీ చిల్లర్​ అక్టోబర్​ 13నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నట్లు.. సీనియర్​ నటుడు సంజయ్​ దత్త్​ దీపావళి తర్వాత సెట్స్​లో అడుగుపెట్టనున్నట్లు వెల్లడించారు. ​

'పృథ్వీరాజ్​' సినిమా రాజ్​పుత్​ వంశస్థుడైన పృథ్వీరాజ్​ చౌహాన్​ జీవితం ఆధారంగా తీస్తున్నారు. యశ్​రాజ్​ ఫిలింస్​ నిర్మిస్తోంది.

ఇదీ చూడండి 'నువ్వే కావాలి' కోసం నేను, రిచా అలా: తరుణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.