బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ పెంచేశారట! 2022లో విడుదలయ్యే తన చిత్రాలకు రూ.135 కోట్లు చొప్పున తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా తెలియకపోయినప్పటికీ ఆయన సన్నిహితులు మాత్రమే ఈ విషయం నిజమేనని అంటున్నారు.
అయితే అక్షయ్ రూ.200 కోట్లకు పారితోషికం చేరుకున్నా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ అక్షయ్‌కు నిర్మాతలు అంతమొత్తం ఎందుకు ఇస్తున్నారు?
అక్షయ్ సినిమా అంటే వేగంగా పూర్తవుతుంది, మార్కెట్లో డిమాండ్ కూడా బాగానే ఉంది, ఎలాంటి కథలోనైనా సరే ఇమడగలరు అనే కారణాల వల్ల నిర్మాతలు ఆయనతో కలిసి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.
జనవరి నుంచి 'బచ్చన్ పాండే' షూటింగ్
లాక్డౌన్ పరిస్థితుల్లోనూ అక్షయ్ 'బెల్ బాటమ్' సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. జనవరి నుంచి 'బచ్చన్ పాండే' చిత్రీకరణలో ఆయన పాల్గొనున్నారు. జైసల్మేర్‌లో తొలి షెడ్యూల్ జరగనుంది.
మిగతా సినిమాలు కూడా
దీనితో పాటే 'అతిరంగీ రే', 'సూర్యవంశీ', 'పృథ్వీరాజ్', 'మిషన్ లయన్', 'రామ్‌సేతు', 'రక్షాబంధన్' తదితర సినిమాల్లో అక్షయ్ నటించాల్సి ఉంది. వీటిలో కొన్ని చిత్రాలు 2022లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇవీ చదవండి:
- అక్షయ్ బాలీవుడ్ ఎంట్రీ.. ఈ హీరోయిన్లు పుట్టనేలేదు!
- తాజ్‌మహల్ ముందు 'షాజహాన్'లా అక్షయ్
- 'బెల్‌బాటమ్' కోసం అక్షయ్ 18 ఏళ్ల రూల్ బ్రేక్
- హీరో అక్షయ్ కుమార్.. రోజుకో గ్లాస్ గోమూత్రం
- టిప్పుగా అక్షయ్‌కుమార్‌కు ముద్దిచ్చిన మహిళ
- వెళ్లగొట్టిన చోటే బంగ్లా కొన్న హీరో అక్షయ్ కుమార్
- అక్షయ్ 'గే' అని అమ్మ చెప్పింది!
- బేర్‌గ్రిల్స్‌తో అక్షయ్ కుమార్ అడ్వెంచర్