ETV Bharat / sitara

'సూర్యవంశీ', '83' దీపావళి రేసులో లేనట్లే! - అక్షయ్ కుమార్ తాజా వార్తలు

లాక్​డౌన్ సడలింపుల్లో భాగంగా థియేటర్ల ఓపెనింగ్​కు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో బాలీవుడ్​లో సినిమాల విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాతలు. అయితే ఈ దీపావళి రేసులో అక్షర్ కుమార్ 'సూర్యవంశీ' ఉండబోదని స్పష్టం చేశారు నిర్మాత సిబాషిష్ సర్కార్.

Akshay Kumar starrer 'Sooryavanshi' not releasing on Diwali
'సూర్యవంశీ', '83' దీపావళి రేసులో లేనట్లే!
author img

By

Published : Oct 1, 2020, 8:21 PM IST

లాక్​డౌన్ సడలింపుల్లో భాగంగా ఈనెల 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి అనుమతించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో తమ చిత్రాల విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. అయితే అక్షయ్ కుమార్ నటించిన 'సూర్యవంశీ' మాత్రం దీపావళి రేసులో లేదంటూ తాజాగా స్పష్టం చేశారు రిలయన్స్ ఎంటర్​టైన్మెంట్స్ సీఈఓ సిబాషిష్ సర్కార్.

"నేను ఒకటి స్పష్టంగా చెప్పదల్చుకున్నా. 'సూర్యవంశీ' చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడం కుదరదు. అన్ని థియేటర్లు అక్టోబర్ 15న తెరుచుకోవట్లేదని సమాచారం. మేము 'సూర్యవంశీ', 83 విడుదల తేదీలపై ఇంకా ఏ స్పష్టత ఇవ్వలేం. రెండు చిత్రాల విడుదల తేదీలు వాయిదా వేస్తామా? లేక ఒక చిత్రం వాయిదా వేస్తామా? అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ డిసెంబర్ నుంచి మార్చి వరకు సినిమాలు విడుదల చేయడానికి అనువైన సమయం అనుకుంటున్నాం."

-సిబాషిష్ సర్కార్, నిర్మాత

'సూర్యవంశీ' చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 24న విడుదలకావాల్సి ఉంది. అలాగే కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన '83' ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ రెండు చిత్రాల విడుదల వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.