భారత్‌లో సినీ తారలను ఆరాధ్యులుగా కొలుస్తారు. వారిని కలవడానికి వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఇంట్లో ఫంక్షన్‌కు వారు అతిథులుగా వచ్చి చిందేస్తే ఎంత బాగుండూ అనుకుంటూ కలలుకనేవారూ లేకపోలేదు. అయితే ఆ కల నిజం చేసుకోవాలంటే వారి 'వెల' తెలియాలి. ఒక్కో ప్రైవేటు ఈవెంటులో డ్యాన్స్ చేయడానికి ఈ బాలీవుడ్ నటులు ఎంత తీసుకుంటారంటే..?
1. అక్షయ్ కుమార్
![bollywood stars charge per event](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13044394_2.jpg)
వరుస సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉంటారు అక్షయ్ కుమార్. ఎలాంటి కార్యక్రమంలో అయినా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ హుషారు తెప్పిస్తుంటారు. ఈ ఖిలాడీ కుమార్.. ఒక్కో ఈవెంట్‌కు రూ.2.5 కోట్లు తీసుకుంటారని సమాచారం.
2. షారుక్ ఖాన్
![bollywood stars charge per event](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13044394_3.jpg)
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్టైలే వేరు. ఉత్సవాల్లో తనదైన శైలిలో హాస్యం పండిస్తూ అలరిస్తారు. 'పఠాన్' చిత్రీకరణలో ఉన్న షారుక్.. త్వరలోనే అట్లీ, రాజ్‌కుమార్ హీరాణీలతో సినిమాలు చేయనున్నారు. ఈయన ఒక్క ఈవెంట్‌కు రూ. 3కోట్లు తీసుకుంటారని వినికిడి.
3. సల్మాన్ ఖాన్
![bollywood stars charge per event](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13044394_4.jpg)
కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు దేశవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. ఈయన ఒక్క ఈవెంట్లో డ్యాన్స్ చేయడానికి రూ.2 కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం 'టైగర్ 3' షూటింగ్లో బిజీగా ఉన్నారు సల్మాన్.
4. కత్రినా కైఫ్
![bollywood stars charge per event](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13044394_5.jpg)
బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ అంటే కుర్రకారు పడిచచ్చిపోతారు. ప్రస్తుతం 'ఫోన్ భూత్', 'టైగర్ 3' చిత్రాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఒక్క డ్యాన్స్ ఈవెంట్‌కు రూ. 3.5 కోట్లు తీసుకుంటారని సమాచారం.
5. ప్రియాంకా చోప్రా
![bollywood stars charge per event](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13044394_6.jpg)
ప్రస్తుతం 'సిటాడెల్' అనే అంతర్జాతీయ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉన్నారు ప్రియాంకా చోప్రా. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించబోయే బాలీవుడ్ చిత్రం 'జీ లే జరా' చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ హాట్ భామ.. మీ ఫంక్షన్లో చిందేయాలంటే రూ. 2.5కోట్లు సమర్పించుకోవాల్సిందే.
6. హృతిక్ రోషన్
![bollywood stars charge per event](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13044394_1.jpg)
బాలీవుడ్లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్. ఇక హృతిక్ డ్యాన్స్‌కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం 'విక్రమ్ వేదా' రీమేక్‌లో నటిస్తున్న ఆయన.. ఒక్కో ఈవెంటుకు రూ. 2.5 కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది.
ఇదీ చూడండి: ప్రాచి దేశాయ్.. నటనతోనే కాదు వివాదాలతోనూ!