Akshya kumar news: అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్ తీసిన సినిమా 'పుష్ప'. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో 'పుష్ప'కు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బన్నీ, సుకుమార్‌కు అక్కడ క్రేజ్ విపరీతంగా పెరిగింది. సెలబ్రిటీలు సైతం అల్లు అర్జున్ నటనను, సుక్కు దర్శకత్వ ప్రతిభను కొనియాడుతున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అయితే, ఏకంగా తనతో ఓ సినిమా చేయాలని కోరాడట. ఈ విషయాన్ని స్వయంగా సుకుమారే వెల్లడించారు.
ఇటీవల అక్షయ్‌కుమార్ 'పుష్ప' చిత్రం చూశారు. సినిమా తనకు బాగా నచ్చడం వల్ల అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత అక్షయ్ స్వయంగా సుకుమార్‌కు ఫోన్ చేసి మెచ్చుకున్నారట. అంతేకాదు, తనతో ఒక సినిమా చేయాలని కోరినట్లు సుకుమార్ తెలిపారు. అక్షయ్‌తో మాట్లాడటం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తానని సుకుమార్ స్పష్టం చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: