ETV Bharat / sitara

నా సినిమాలు వాళ్లకు నచ్చవు: అక్షయ్ కుమార్ - లక్ష్మీ బాంబ్​ సినిమా

తాను సినిమాల్లో నటించేది కేవలం ప్రేక్షకులను మెప్పించడం కోసమేనని హీరో అక్షయ్ కుమార్ అన్నారు. విమర్శకులు తన చిత్రాల్ని ఇష్టపడకపోవడాన్ని గొప్పగా భావిస్తున్నట్లు తెలిపారు.

Akshay Kumar Reacts to 'Laxmii' Criticism: I Feel Great, Critics Don't Like my Films
'నా సినిమాలు వాళ్లకు నచ్చవు.. అదే గొప్పగా భావిస్తున్నా'
author img

By

Published : Nov 13, 2020, 4:58 PM IST

సినీ విమర్శకులు తన చిత్రాలు ఎందుకు ఇష్టపడరో అర్థమైందని బాలీవుడ్​ హీరో అక్షయ్​ కుమార్ అన్నారు​. ఆయన నటించిన 'లక్ష్మి' చిత్రం ఈ మధ్యే విడుదలై ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. కానీ క్రిటిక్స్​ నుంచి మాత్రం మంచి సమీక్షలు రాలేదు. ఈ విషయమై అక్షయ్​​ స్పందించారు.

"చాలామంది విమర్శకులు నా సినిమాలను ఇష్టపడరని తెలుసు. దాన్ని గొప్పగా భావిస్తున్నాను. వాళ్లకు వైవిధ్యం నచ్చకపోవచ్చు, ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను. కానీ, నా దృష్టంతా ప్రేక్షకులను మెప్పించడమే. నా కెరీర్​లో అతిపెద్ద ఓపెనింగ్​ తెచ్చిన చిత్రం ఇదేనని అంటున్నారు. ఇందులో లింగమార్పిడి చేసుకున్న నటుడు.. ఎల్​జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడు. అలానే ప్యాడ్​మ్యాన్​ (2018), టాయిలెట్​: ఏక్​ ప్రేమ్​ కథ (2017), మిషన్ మంగళ్​ (2019) సినిమాలను చూస్తే అవి కూడా ఓ కొత్త కథతో రూపొంది, బాక్సాఫీస్​ వద్ద హిట్​గా నిలిచాయి"

- అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ కథానాయకుడు

తెలుగు, తమిళంలో సూపర్​హిట్​గా నిలిచిన 'కాంచన' చిత్రాన్ని.. దర్శకుడు రాఘవ లారెన్స్​ బాలీవుడ్​లో 'లక్ష్మి' రీమేక్​ చేశారు. ఇందులో అక్షయ్​ ప్రధానపాత్రలో నటించారు. కియారా అడ్వాణీ, శరద్​ కేల్కర్​, ఆయేషా రాజా మిశ్రా తదితరులు నటించారు.

దీపావళి సందర్భంగా నవంబరు 9న డిస్నీ+హాట్​స్టార్​లో 'లక్ష్మి' విడుదలైంది. ఓటీటీలో వచ్చిన కొన్ని గంటల్లోనే సరికొత్త రికార్డులను సృష్టించినట్లు సదరు ఓటీటీ యాప్ వెల్లడించింది. ఇప్పటివరకు భారీ ఓపెనింగ్స్​ లభించిన చిత్రం ఇదేనని ఓ ప్రకటనలో పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.