'నేను ఎవరిని? అని ప్రతి ఒక్కరూ తనను తాను ప్రశ్నించుకొని తెలుసుకొనే ప్రయత్నం చేయమన్నారు రమణ మహర్షి. ఈ అనంతకోటి బ్రహ్మాండ రాశిలో నీవెవరో, నీ స్థానం ఎక్కడో, ఎక్కడ నుంచి వచ్చావో, ఎక్కడికి పోతావో తెలుసుకొనే ప్రయత్నం చేస్తే మోక్షం వస్తుందో రాదోగానీ వినయం వస్తుంది. 'విర్రవీగటం పోయి ఎంత ఎదిగినా ఒదిగి వుండే' సులక్షణం అబ్బుతుంది. ఆధ్యాత్మిక రంగంలో ఈ బాటను అనుసరించి చిరస్మరణీయులైన మహానుభావులు ఎందరో ఉన్నారు. అయితే అనేక ప్రలోభాలకు, ఆకర్షణలకు అన్ని వికారాలకు సుఖలాలసకూ తావైన సినిమా రంగంలోని వ్యక్తి తనను తాను తెలుసుకొనే ప్రయత్నం చేయడం అరుదైన విషయం. మరి ఈ జాబితాకు చెందిన వ్యక్తే దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు.
చదువు కొనసాగించలేక.. నాటకాలు
ఏఎన్ఆర్.. చిన్న వయసులో చదువు కొనసాగించలేక, నాటకాల్లో నటించారు. వాటిలోనూ మహిళా పాత్రలే ఎక్కువ. అప్పటికి తెలుగు సినిమా పురుడు పోసుకొని పదేళ్లు కావస్తోంది. చిత్తూరు నాగయ్య, సి.హెచ్.నారాయణరావులు హీరోలుగా సినిమా రంగాన్ని ఏలుతున్న రోజులలో అక్కినేని తెరంగేట్రం జరిగింది. బక్కపలుచని శరీరం, పీలగొంతుక, కేవలం నాలుగో తరగతి వరకూ చదివిన వానాకాలం చదువు అక్కినేని తన స్థాయి ఏమిటో తను తెలుసుకొనేటట్లు చేశాయి.
చన్నీటి కుండతో సాధన
అప్పట్లో ఎవరి పాటలు వారే పాడుకొనే పరిస్థితి. నేపథ్యగానం ఇంకా నెలకొనలేదు. గాత్రశుద్ధి కోసం చన్నీటికుండ తో సాధన చేశారు అక్కినేని. ఆ నాటి దిగ్గజాల మధ్య మసలుతూ ఎన్నో నేర్చుకొన్నారు. నటుడిగా, వ్యక్తిగా తను ఆటగాడిని మాత్రమేనని పాటగాడిని కాదని గ్రహించారు. చిత్ర రంగానికి రాకముందే పరిచయమున్న ఘంటసాలను తనకు నేపథ్యగాయకుడిగా ఎన్నుకొన్నారు అక్కినేని. కీలుగుర్రమెక్కి 'బాలరాజు'లా పల్నాటి బాలచంద్రుడిలా విజృంభించారు. ఓ లైలా కోసం 'మజ్ను' అయ్యారు. జానపద హీరోగానే కాకుండా విషాదాంతక పాత్రలకూ పనికొస్తాడనిపించుకొన్నారు. ఆ తరుణంలో ఎన్టీఆర్ ప్రవేశం జరిగింది.
ఎన్టీఆర్ అక్కినేనిని ఆలోచనలో పడేశారు
అందాల రాజకుమారుడిగా, చిలిపి కృష్ణుడిగా ఏ పాత్రకైనా సరిపడే ఆహార్యం గల నందమూరి, అక్కినేనిని మరలా ఆలోచనలో పడేశారు. ఆ పాత్రలకు తాను తగనని గ్రహించారు అక్కినేని. ఫలితం సుమారు పది సంవత్సరాలు జానపద కథానాయకుడిగా వెలిగాక తొలిసారిగా సాంఘికం 'సంసారం'లో నటించారు. అలా ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకొంటూ విజయాల నుంచి, పరాజయాల నుంచి ఎంతో నేర్చుకున్నారు. ప్రలోభాలకు వ్యసనాలకులోనై బంగారు భవిష్యత్తును బుగ్గి చేసుకొన్న ఎందరో నటీనటుల జీవితాలను పరికిస్తూ, తనను తాను తీర్చిదిద్దుకొన్నారు. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలను పోషించి చలనచిత్ర రంగపు అత్యుత్తమ అవార్డు 'పద్మభూషణ్'ను పొందారు. 72 ఏళ్ల సుదీర్ఘ సినీ నటజీవితాన్ని తాను కోరుకున్నట్లుగా నటిస్తూనే ముగించటం కోసం ఆఖరి చిత్రం 'మనం'కు డబ్బింగ్ బెడ్ మీద నుంచే చెప్పి పైలోకాలకు భౌతికంగా, అభిమానుల గుండెల్లోకి శాశ్వతంగా తరిలిపోయిన అక్కినేని ఓ పరిపూర్ణ నటుడు, వ్యక్తి, ఓ లెజెండ్. ఆయనలోని, ఆయనకే సాధ్యమైన కొన్ని ప్రత్యేకతలను చూద్దాం.
సమతౌల్యం (బ్యాలెన్స్)
చిత్రాల ఎంపిక
స్టెప్స్
వైవిధ్యం
అక్కినేనిని అమరుడిని చేసింది ఈ లక్షణం. జానపద వీరుడిగా వేసి 'మజ్ను', 'దేవదాసు' వంటి ట్రాజెడీ పాత్రలు వేశాక అక్కడే ఆగిపోకూడదని 'చక్రపాణి', 'మిస్సమ్మ' చిత్రాలలో హాస్యపాత్రలు ఏరికోరి వేయడం ‘లాంగివిటీని’ పెంచింది. 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో కృష్ణుడి బదులుగా అర్జునుడిగా, 'చాణక్య చంద్రగుప్త'లో చంద్రగుప్తుడి బదులుగా చాణక్య పాత్రలు వేయడం ఆయన బుద్ధికుశలతను సూచిస్తుంది. ట్రాజెడీ కింగ్‌గా బ్రాండ్ పడిపోయింది. ప్రేమికుడిగా తిరుగులేదు. నారదుడిగా, తెనాలి రామకృష్ణుడిగానూ రాణించారు. ట్రాజెడీ కింగ్‌లాంటి బలమైన ముద్ర ఉన్నా, మరలా భక్తి పాత్రలు వేశారు (విప్రనారాయణ, భక్తతుకారం) ఇచ్చారు. భక్త జయదేవ, మహా కవి కాళిదాసు, అమరశిల్పి జక్కన్న వంటి కళాకారులకు సెల్యూలాయిడ్ రూపాన్ని ఇచ్చారు. స్వతహాగా నాస్తికుడై ఉండి దేవుడి మీద భక్తిని కురింపించగలగడం అసాధారణ నటుడికే చెల్లుతుంది.
బాధ్యత
కుటుంబం
కీర్తిప్రతిష్టాలు, డబ్బు మైకంలో కుటుంబాన్ని విస్మరించిన ఘనులెందరో. అక్కినేని అలాకాదు. అసలు పిల్లల చదువుకోసమే మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేశారు. నెలలో ఒకరోజు కుటుంబ సభ్యులందరు కలవాలనే రివాజు పెట్టారు. క్రమశిక్షణతో మెలుగుతున్న సినీనటుల కుటుంబాలలో అక్కినేని కుటుంబం మొదటి వరుసలో ఉంటుంది.
పట్టుదల
ఇదీ చదవండి: ఆ వార్తలు అవాస్తవం: ఆలియా భట్