ETV Bharat / sitara

సురేందర్​రెడ్డి చిత్రంలో 'ఏజెంట్​'గా అఖిల్​ - ఏజెంట్​ ఫస్ట్​లుక్

అక్కినేని అఖిల్​-దర్శకుడు సురేందర్​రెడ్డి కాంబినేషన్​లో రూపొందుతోన్న చిత్రానికి 'ఏజెంట్​'గా టైటిల్​ ఖరారు చేశారు. గురువారం అఖిల్​ పుట్టినరోజు సందర్భంగా టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

Akkineni Akhil's next titled As Agent
సురేందర్​రెడ్డి చిత్రంలో 'ఏజెంట్​'గా అఖిల్​
author img

By

Published : Apr 8, 2021, 9:26 AM IST

'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' చిత్రం తర్వాత అఖిల్‌ అక్కినేని నటించనున్న కొత్త చిత్రం ఇప్పటికే ఖరారైంది. ఆయన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మించనున్నారు. కథానాయికగా సాక్షి వైద్య నటించనున్నారు. గురువారం అఖిల్​ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్​తో పాటు అఖిల్​ ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. ఈ సినిమాకు ఏజెంట్​ అనే టైటిల్​ను ఖరారు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. డిసెంబరు 24 ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం.

ఓ విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమా కోసమే అఖిల్‌ తన లుక్‌ని కూడా మార్చుకున్నారు. దీంట్లో ఆయన కండలు తిరిగిన దేహంతో మునుపెన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపించనున్నారు.

ఇదీ చూడండి: 'పుష్ప' గురించి మలయాళ నటుడు ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.