ETV Bharat / sitara

థియేటర్లలో 'అఖండ'.. ఆ రాష్ట్రంలో రిలీజ్​కు రెడీ - balayya akhanda movie

Akhanda movie: మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు బాలయ్య రెడీ అయిపోతున్నారు. తమిళనాడులో ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్​.. శుక్రవారం(జనవరి 28) రిలీజ్​ కానుంది.

balayya akhanda movie
బాలయ్య అఖండ మూవీ
author img

By

Published : Jan 27, 2022, 11:44 AM IST

Balayya akhanda tamil movie: 50 రోజులకుపైగా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన బాలయ్య.. ఇప్పుడు తమిళనాడులోనూ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'అఖండ' తమిళ డబ్బింగ్​ వెర్షన్​తో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 28న అంటే ఈ శుక్రవారమే ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

'Akhanda' Tamil version
అఖండ తమిళ వెర్షన్

కరోనా ప్రభావం వల్ల కొత్తగా తమిళ సినిమాలేవి థియేటర్లలోకి రావడం లేదు. చాలావరకు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే 'అఖండ'ను అక్కడి థియేటర్లలో రిలీజ్ చేయాలని పలువురు డిస్ట్రిబ్యూటర్స్​ భావించారు. అందులో భాగంగానే డబ్బింగ్ వెర్షన్​ రిలీజ్​కు సిద్ధమయ్యారు.

ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి కూడా రావడం వల్ల తమిళ అభిమానులు కొందరు సబ్​టైటిల్స్​తో సినిమాను చూసేస్తున్నారు. ఇప్పుడు థియేటర్లలోకి తీసుకొస్తుండటం వల్ల వెండితెరపై బాలయ్య మేనియాను ఆస్వాదించనున్నారు.

'Akhanda' Tamil version
బాలయ్య అఖండ

ఇందులో బాలయ్య అఘోరాగా కనిపించి, చేసిన ఫైట్స్​ దానికి తోడు తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవల్. బోయపాటి డైరెక్షన్.. అభిమానులతో అరుపులు పెట్టించింది. ఈ సినిమా దాదాపు 103 కేంద్రాల్లో 50 రోజులకు పైగా ప్రదర్శితమై రూ.200 కోట్లకు పైగా గ్రాస్​ వసూలు చేయడం విశేషం.

త్వరలో ఈ సినిమాకు సీక్వెల్​ కూడా రానుంది. దీని తర్వాత బాలయ్య-బోయపాటి కాంబోలో మరో సినిమా కూడా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.