ETV Bharat / sitara

బాక్సాఫీస్​పై బాలయ్య సింహగర్జన.. 'అఖండ' @రూ.100కోట్లు! - akhanda collection day 10

Akhanda Collections: బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీగా కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. పది రోజుల్లోనే రూ.102కోట్ల గ్రాస్​ను వసూలు చేసినట్లు తెలిసింది. బాలయ్య కెరీర్​లోనే ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి.

బాలకృష్ణ అఖండ 100కోట్లు, balakrishna akhanda 100 crores
బాలకృష్ణ అఖండ 100కోట్లు
author img

By

Published : Dec 12, 2021, 2:21 PM IST

Akhanda Collections till date: నందమూరి నటసింహం బాలకృష్ణ సెంచరీ కొట్టారు. సెంచరీ కొట్టడమేంటి అనుకుంటున్నారా? విషయమేమిటంటే.. ఆయన నటించిన తాజా చిత్రం 'అఖండ' థియేటర్లు దద్దరిల్లేలా గర్జిస్తూ బాక్సాఫీస్​ను షేక్​ చేస్తోంది. ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే రూ.102కోట్ల గ్రాస్​ మార్క్​ను టచ్​ చేసిందని తెలిసింది.​ అలాగే రూ.61.5కోట్ల షేర్​ను దాటిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

అంతకుముందు క్రిష్​ దర్శకత్వంలో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా బాక్సాఫీస్​ వద్ద రూ.75 కోట్లు వసూళ్లు చేయగా..ఈ చిత్రంతో కెరీర్​లో తొలిసారి రూ.100కోట్ల గ్రాస్​ను అందుకున్నారు బాలయ్య! ఇక ఈ సినిమా ప్రీరిలీజ్​ బిజినెస్​ రూ.53కోట్లు జరిగినట్లు సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓవర్సీస్​లోనూ దూకుడు

'అఖండ' చిత్రం విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. కలెక్షన్ల పరంగా బాలయ్య కెరీర్​లో తొలిసారిగా 1మిలియన్​ మార్క్​ను అందుకోబోతుంది. ఇప్పటికే 9లక్షల 50వేల డాలర్లు వసూలు చేసినట్లు సమాచారం.

'సింహ', 'లెజెండ్'​ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ సినిమా ఇది. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించారు. తమన్ సంగీతమందించగా, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

ఇదీ చూడండి: Akhanda Sequel: బాలయ్య 'అఖండ'కు సీక్వెల్​.. నిజమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.