ETV Bharat / sitara

విదేశాల్లోనూ దుమ్మురేపిన అఖండ- భారీ వసూళ్లు - అఖండ కలెక్షన్స్​

Akhanda first day collection worldwide:నందమూరి బాలకృష్ణ 'అఖండ' స్వదేశంతో పాటు విదేశాల్లోనూ దుమ్మురేపుతోంది. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో తొలిరోజే భారీ వసూళ్లు సాధించింది.

AKHANDA FIRST DAY WORLDWIDE COLLECTION
విదేశాల్లోనూ దుమ్మురేపిన అఖండ
author img

By

Published : Dec 3, 2021, 11:00 PM IST

Akhanda first day collection worldwide: అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ.. బాక్సాఫీస్​ దగ్గర మరోసారి తన సత్తా చాటారు. స్వదేశంలోనే కాదూ.. ఓవర్సిస్​లోనూ దుమ్మురేపింది 'అఖండ'. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తొలిరోజే భారీ వసూళ్లు చేసింది.

  • అమెరికాలో రూ.3.21 కోట్లు
  • కెనడాలో రూ.12.99 లక్షలు
  • యూకేలో రూ.32.58 లక్షలు
  • ఆస్ట్రేలియాలో రూ. 52.15 లక్షలు

భారత్​లో 'అఖండ'గా గర్జించి, తొలిరోజే దాదాపు రూ.31 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేశారు బాలయ్య. సినీ కెరీర్​లో​ తొలిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. దీని బట్టే బాలయ్య సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది.

AKHANDA FIRST DAY WORLDWIDE COLLECTION
అఖండలో బాలకృష్ణ

ఏపీలో ఓవైపు టికెట్ ధరలు తగ్గించడం, మరోవైపు బెన్​ఫిట్​ షోలు లేకపోవడం.. వీటికి తోడు కరోనా కొత్త వేరియెంట్​ ఒమిక్రాన్ భయం.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్​ దగ్గర బాలయ్య మాస్ ర్యాంపేజ్​ను అవేవి అస్సలు నిలువరించలేకపోయాయి. నటసింహం సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేశాయి. దీంతో అభిమానులు థియేటర్ల దగ్గర, సోషల్ మీడియాలో తెగ పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి ముందే వచ్చేసిందని సంబరపడుతున్నారు.

ఇదీ చూడండి: బాలయ్య 'అఖండ' సినిమాకు తొలిరోజు భారీ వసూళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.