ETV Bharat / sitara

ట్రైలర్స్​తో ఆకట్టుకుంటున్న ఆకాశ్, కార్తీక్ ఆర్యన్

పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమా ట్రైలర్(romantic trailer) విడుదలై ఆకట్టుకుంటోంది. అలాగే బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రధానపాత్ర పోషించిన 'ధమాకా' ప్రచార చిత్రం(dhamaka movie trailer) రిలీజైంది.

Romantic
రొమాంటిక్
author img

By

Published : Oct 19, 2021, 5:07 PM IST

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌(akash puri romantic) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రొమాంటిక్‌'. కేతికా శర్మ కథానాయిక. అనిల్‌ పాడూరి దర్శకుడు. ఈ చిత్రం అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే అగ్ర కథానాయకుడు ప్రభాస్‌(prabhas romantic movie) ఈ సినిమా ట్రైలర్‌(romantic trailer)ను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రేమకథా చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలీవుడ్‌ యువ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో రామ్‌ మధ్వానీ తెరకెక్కించిన చిత్రం 'ధమాకా'(kartik aryaan new movie dhamaka). మృణాల్‌ ఠాకూర్‌, అమృత సుభాష్‌, వికాస్‌ కుమార్‌, విశ్వజీత్‌ ప్రధాన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కార్తీక్‌ న్యూస్‌ రీడర్‌గా కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో అలరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. చిత్రబృందం మంగళవారం ట్రైలర్‌(dhamaka movie trailer)ను విడుదల చేసింది. నవంబరు 19న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

ఇవీ చూడండి: బన్నీ-స్నేహ రొమాంటిక్ వీడియో.. ఫ్యాన్స్​ ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.