ETV Bharat / sitara

Thala Ajith: హీరో అజిత్​పై స్టార్​ కమెడియన్​ అసహనం!

author img

By

Published : Feb 27, 2022, 9:35 AM IST

Ajith Valimai: తమిళ స్టార్​ హీరో అజిత్ నటించిన 'వలిమై' థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా మేకర్స్​పై తీవ్ర అసహనంతో ఉన్నాడట ఓ పాపులర్​ కమెడియన్​. ఇంతకీ ఏం జరిగిందంటే?

Thala AjithThala Ajith Valimai
Yogi Babu

Ajith Valimai: తమిళ సూపర్​స్టార్​ అజిత్​ నటించిన 'వలిమై' మేకర్స్​పై గుర్రుగా ఉన్నాడట స్టార్​ కమెడియన్​ యోగి బాబు. అజిత్ ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఫిబ్రవరి 24న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తమిళంలో సూపర్​హిట్​ అనిపించుకున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందనను అందుకుంది.

అయితే ఈ సినిమా చూసిన చాలామందికి తెలియని విషయమేమిటంటే ఇందులో ప్రముఖ హాస్యనటుడు యోగి బాబు కూడా ఓ పాత్ర చేశాడని. కాకపోతే ఆయన సన్నివేశాలన్నింటినీ తొలగించారు. ఇప్పుడు ఇదే విషయమై యోగి బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని సమాచారం. 'వలిమై' డైరెక్టర్​, హీరో అజిత్​ దగ్గర తన అసహనాన్ని వెలిబుచ్చాడని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

Yogi Babu
యోగి బాబు

ప్రస్తుత తరంలో స్టార్​ కమెడియన్​గా వెలుగొందుతున్నాడు యోగి బాబు. సినిమాలకు క్రేజ్​ తీసుకొచ్చేందుకే అతడిని ఎంపిక చేసుకుంటున్నారు మేకర్స్​. అలాంటిది తన సన్నివేశాలనే తొలగించడం యోగి బాబుకు రుచించడం లేదని వినికిడి.

ఇదీ చూడండి: థియేటర్​లో 'వలిమై' సినిమా.. బయట బాంబు పేలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.