ETV Bharat / sitara

Valimai: 'వాలిమై' ఫస్ట్‌లుక్‌.. సీబీ సీఐడి అధికారిగా అజిత్​ - వాలిమై మోషన్​ పోస్టర్ రిలీజ్​

తమిళ స్టార్ హీరో అజిత్​ నటిస్తున్న 'వాలిమై' ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. దీంతో ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.

valimai
వాలిమై
author img

By

Published : Jul 11, 2021, 6:20 PM IST

Updated : Jul 11, 2021, 6:54 PM IST

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'వాలిమై'. తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రానికి సంబంధించి అజిత్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అజిత్‌కు జోడీ హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఏడాది కాలంగా 'వాలిమై'లో అజిత్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఇది తారస్థాయి చేరింది. ఏ కార్యక్రమం జరిగినా అక్కడ అభిమానులు ప్రత్యక్షమవడం అప్‌డేట్‌ ఇవ్వమంటూ నినాదాలు చేయడం వల్ల నేరుగా అజిత్‌ స్పందించాల్సి వచ్చింది. అభిమానుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సహనంతో ఉండాలని సూచించారు. ఎట్టకేలకు ఆదివారం అజిత్‌ 'వాలిమై' ఫస్ట్‌లుక్ విడుదల కావటం వల్ల ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి: WTC Final: క్రికెట్​ స్టేడియంలో సినిమా గోల

Last Updated : Jul 11, 2021, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.