ETV Bharat / sitara

అజిత్ కొత్త చిత్రం.. దర్శకుడు ఎవరంటే? - అజిత్ హెచ్ వినోద్

తమిళ సూపర్​స్టార్ అజిత్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 'వాలిమై' తెరకెక్కిస్తోన్న హెచ్​వినోద్​కు మరో అవకాశం ఇచ్చారట.

Ajith
అజిత్
author img

By

Published : Apr 29, 2021, 5:31 AM IST

తమిళ సూపర్​స్టార్ అజిత్​కు దర్శకుల్ని రిపీట్ చేయడం కొత్తేమీ కాదు. శివతో వరుసగా నాలుగు చిత్రాలు చేశారు. మరో డైరెక్టర్​కు వరుస అవకాశాలు ఇస్తూ అభిమానుల్ని సర్​ప్రైజ్ చేస్తున్నారు అజిత్. తాజాగా ఆయన హెచ్​ వినోద్​తో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే వినోద్​తో ఇది వరుసగా మూడో చిత్రమవుతుంది.

'నేర్కొండ పార్వై' చిత్రంతో అజిత్​తో కలిసి తొలిసారి పనిచేశారు వినోద్. ఇది హిందీ 'పింక్​'కు రీమేక్. ఆ తర్వాత ప్రస్తుతం వీరిద్దరూ 'వాలిమై' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇది చిత్రీకరణ దశలో ఉండగానే వినోద్​కు అజిత్ మరో అవకాశం ఇచ్చినట్లు కోలీవుడ్​లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి కూడా బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరిస్తారట. ఈ మూవీ జులై నుంచి పట్టాలెక్కనుందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.