ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'.. ఈ నాలుగు పాత్రలు చాలా కీలకం​!

RRR key roles: పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతోన్న 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు భాగమయ్యారు. ట్రైలర్​లో వారు చెప్పే సంభాషణలు, పలికించిన హావాభావాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన వారి గురించి తెలుసుకుందాం..

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Mar 24, 2022, 7:40 PM IST

RRR key roles: "యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్‌".. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో హీరోల పాత్రల గురించి నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఇది. ఇప్పుడిదే డైలాగ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌కు సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిత్రంలో వివిధ భాషలు, ప్రాంతాలు, దేశాలకు చెందిన నటీనటులందరూ భాగస్వామ్యమయ్యారు. వారందరూ కీలకపాత్రలు పోషించారు. ఇంతకీ వారెవరో తెలుసుకుందాం..

అజయ్​దేవగణ్​: బాలీవుడ్‌ నటుడు అజయ్‌దేవ్‌గణ్‌ నేరుగా నటించిన తొలి తెలుగు సినిమా ఇదే. ఇందులో ఆయన ఓ పోరాట యోధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన కనిపించేంది కొంతసేపే అయినప్పటికీ.. అది ప్రేక్షకులపై ఎంతో ప్రభావం చూపుతుందని చిత్రబృందం చెప్పింది. ఈ సినిమా కోసం ఆయన పారితోషికం కూడా తీసుకోలేదని తెలిసింది.

శ్రియ: ఇందులో అజయ్‌దేవ్‌గణ్‌ భార్య సరోజిని పాత్రలో నటి శ్రియ నటించారు. బరువైన గుండెతో కుటుంబాన్ని వదిలి.. భర్త అడుగుజాడల్లో పోరాట మైదానంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె కనిపించనున్నారు. శ్రియ పాత్ర ఎంతో భావోద్వేగాలతో రూపుదిద్దుకుందని ట్రైలర్​ చూస్తుంటే తెలుస్తోంది. అంతకుముందు ఆమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఛత్రపతి' సినిమాలో నటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సముద్రఖని: ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన వారిలో కోలీవుడ్‌ నటుడు, దర్శకుడు సముద్రఖని ఒకరు. ఇందులో ఆయన పోలీస్‌ కానిస్టేబుల్‌ రోల్‌లో రామ్‌చరణ్‌కు అత్యంత సన్నిహితుడిగా కనిపించనున్నారు. బ్రిటీష్‌ వారిపై యుద్ధం చేయడానికి రామ్‌చరణ్‌ సిద్ధమవుతుండగా.. "చాలా ప్రమాదం ప్రాణాలు పోతాయ్‌ రా" అంటూ ఆయన భావోద్వేగంతో చెప్పే సంభాషణలు ప్రేక్షకులను కట్టిపడేశాయ్​. టాలీవుడ్‌ నటుడు రాహుల్ రామకృష్ణ సైతం ఈసినిమాలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఆయన తారక్‌ వెంట ఉండే వ్యక్తిగా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రాజీవ్‌ కనకాల: జక్కన్న తెరకెక్కించిన చాలా సినిమాల్లో రాజీవ్​ కనకాల నటించారు. 'స్టూడెంట్‌ నం:1', 'సై', 'విక్రమార్కుడు' చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇందులో భీమ్‌ పాత్ర గొప్పతనం గురించి బ్రిటీష్‌ వాళ్లకు రాజీవ్‌ వివరించే సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో తారక్‌కు జోడీగా కనిపించనున్నారు విదేశీ భామ ఒలీవియా మోరీస్‌. విడుదలైన ప్రచార చిత్రంలో ఆమె తళుక్కున మెరిసి భారతీయ ప్రేక్షకులు అందరినీ తన అందంతో కట్టిపడేశారు. ప్రతినాయకురాలి పాత్రలో ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ కనపించారు. ఈ సినిమాలో మరో ప్రధాన విలన్‌ పాత్ర స్కాట్‌. దీన్ని ఐరిష్‌ నటుడు రే స్టీవెన్‌సన్‌ పోషించారు. 'ది థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌' అనే బ్రిటిష్‌ చిత్రంతో 1998లో నటుడిగా మారారు స్టీవెన్‌ సన్‌. 'ఔట్‌పోస్ట్‌', 'ది అదర్‌ గాయ్స్‌', 'బిగ్‌గేమ్‌', 'కోల్డ్‌స్కిన్‌', 'ఫైనల్‌స్కోర్‌' తదితర సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించారు.

ఇదీ చూడండి: రికార్డుల రారాజు.. హిట్​ వదలని 'విక్రమార్కుడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.