విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ను తలచుకుంటే.. నీలి కళ్లు, అందమైన రూపం, ఆహా అనిపించే నవ్వు కళ్లముందు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఓ అమ్మడు ఐశ్వర్య పోలికలతో నెటిజన్లను మైమరపిస్తోంది. తనే పాకిస్థాన్‌కు చెందిన ఆమ్నా ఇమ్రాన్. ప్రస్తుతం ఆమె ఫొటోలు వైరల్‌గా మారాయి. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఆమెను ఐశ్వర్య డూప్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
బూడిద రంగులో ఉన్న పెద్ద కళ్లు, గులాబీ రేకుల్లాంటి పెదాలతో వైట్ షర్ట్ వేస్తుకుని అచ్చం ఐశ్వర్య రాయ్ చూసినట్లుగా కెమెరాకు పోజు ఇచ్చిన ఫొటోను ఆమ్నా ఇన్‌స్టాలో పోస్టు చేసింది. "అల్లాముదల్లా ఎక్స్ ఏ మిలియన్, థ్యాంక్‌పుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ సర్‌ప్రైజ్. థ్యాంక్యూ అల్లా" అని వ్యాఖ్య జోడించింది.
ఐశ్వర్యరాయ్ పోలికలతో ఉన్న అమ్మాయిలు కనపడటం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు కూడా కొంతమంది అచ్చం ఐశ్వర్యలా కనిపించి వైరల్‌గా మారారు. గతంలో షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, హృతిక్ రోషన్ డూప్‌లు నెట్టింట్లో హల్చల్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: అందాల 'ఐశ్వర్య' రాశి.. ఈ నీలికళ్ల విశ్వ సుందరి