విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ను తలచుకుంటే.. నీలి కళ్లు, అందమైన రూపం, ఆహా అనపించే నవ్వు కళ్లముందు కనిపిస్తుంది. అందుకే అమ్మాయిని ఐశ్వర్యతోనే ఎక్కువగా పోలుస్తూ మాట్లాడుతుంటారు. అయితే ప్రస్తుతం ఓ అమ్మడు ఐశ్వర్య పోలికలతో నెటిజన్లను మైమరపిస్తోంది. తనే మానసి. ప్రస్తుతం ఆమె ఫొటోల వైరల్‌గా మారాయి. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోజులపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
గతంలో ఐశ్వర్యను పోలినట్లుగా ఉండి టాలీవుడ్లో సందడి చేసింది స్నేహా ఉల్లాల్. తాజాగా మానసి కూడా అదే జాబితాలో చేరనుంది. అయితే 2005లో 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' సినిమాతో కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సరసన నటించిన స్నేహ ఉల్లాల్.. ఆ తర్వాత కనుమరుగైపోయింది. మానసి ప్రస్తుతం టిక్‌టాక్, ఇన్‌స్టా, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో మంచి పేరు తెచ్చుకుంది. ఫ్యాషన్ రంగంలో ఉన్న ఈభామ సినిమాల్లో ఛాన్స్ కొడుతుందేమో చూద్దాం.