బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ల గారాలపట్టి ఆరాధ్య బచ్చన్... తనలోని సృజనాత్మకతను బయటపెట్టింది. ప్రాణాలను పణంగా పెట్టి, కరోనాపై అహర్నిశలు పోరాడుతున్న వీరులపై ప్రేమను చాటుకుంది. వారికి ధన్యవాదాలు చెబుతూ ఓ చిత్రాన్ని గీసింది. దీనిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఐష్.. కరోనా వీరులందరికి ప్రేమ, కృతజ్ఞతలు చెప్పిన నా కుమార్తె ఆరాధ్య" అంటూ వ్యాఖ్యను జోడించింది.
ఈ ఫొటోలో వైద్యుడు, నర్సు, పోలీసు, పారిశుద్ధ్య కార్మికుడు, జర్నలిస్టు, సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. వీరందరికీ చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతూ, వారి పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది ఆరాధ్య. దీంతోపాటు అమ్మనాన్న అభిషేక్, ఐశ్వర్యల మధ్యలో తాను నిలబడి ఉన్నట్లు ఇందులో గీసింది. "ఇంటి వద్దనే ఉండండి.. జాగ్రత్త పాటించండి" అంటూ రాసుకొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఫొటో పోస్ట్ చేసిన ఐశ్... కూతురు ఆరాధ్య పట్ల ఎంతో గర్వంగా ఉన్నట్లు తెలిపింది. ఓ స్టార్ కుమార్తెలా కాకుండా సాదాసీదా ఆడపిల్లలా పెంచుతున్నట్లు చెప్పింది.