అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతా హ్యాకైన ఒక్కరోజులోనే ప్రముఖ బాలీవుడ్ సింగర్ అద్నాన్ సామీ ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్‌కు గురైంది. బిగ్ బీ ఖాతాను హ్యాక్ చేసిన టర్కిష్ గ్రూపు 'అయిల్దిజ్ టిమ్' అద్నాన్ సామీ ఖాతాను కూడా స్తంభింపజేసింది.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోను అద్నాన్ సామీ ప్రొఫైల్ పిక్చర్‌కు అనుసంధించారు. అంతేకాదు సామీ బయోలో 'అయిల్దిజ్ టిమ్ లవ్ పాకిస్థాన్' అని మార్చారు. టర్కిష్, పాక్ జెండాలను ఇమోజీల రూపంలో చేర్చారు.
సోమవారం అర్ధరాత్రి 11:40 గంటలకు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతా హ్యక్కు గురైంది. అయితే అరగంటలోనే సమస్య పరిష్కరించారు ముంబయి సైబర్ పోలీసులు. ఇంతకు ముందు షాహిద్ కపూర్, అనుపమ్ ఖేర్ ఖాతాలను కూడా ఇదే గ్రూపు హ్యాక్ చేసింది.