ETV Bharat / sitara

రొమాంటిక్​ సాంగ్​తో 'మేజర్'.. సంక్రాంతికే 'సామాన్యుడు' - malvika nair

Adivi Sesh Major: కొత్త సినిమాల కబుర్లు వచ్చేశాయి. ఇందులో అడివి శేష్ నటిస్తున్న 'మేజర్', రాజశేఖర్ నటిస్తున్న 'శేఖర్' సహా పలు చిత్రాల విశేషాలు ఉన్నాయి.

adivi sesh major
మేజర్
author img

By

Published : Jan 4, 2022, 7:27 PM IST

Adivi Sesh Major: 26/11 ముంబయి దాడుల ఆధారంగా మేజర్​ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథతో 'మేజర్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. టైటిల్‌ పాత్రను అడివి శేష్‌ పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్క దర్శకుడు. ఈ సినిమాలోని 'హృదయమా' అనే పాటను జనవరి 7న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కానుంది.

adivi sesh major
మేజర్

సంక్రాతికే రానున్న 'సామాన్యుడు'

కథానాయకుడు విశాల్ నటిస్తూ నిర్మించిన ద్విభాషా చిత్రం 'సామాన్యుడు'. శరవణణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న సామాన్యుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు విశాల్ వెల్లడించారు. మొదట ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయాలని భావించారు. కానీ వరుస సెలవులు కలిసిరావడం వల్ల వారం ముందుగానే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

vishal
'సామాన్యుడు'

డబ్బు, పలుకబడితో సామాన్యులపై అధికారం చెలాయించాలనుకునే ఓ వర్గాన్ని సామాన్యుడు ఎలా ఎదిరించాడనే కథాంశంతో విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విశాల్ సరసన డింపుల్ హయాతి కథానాయికగా నటించింది.

పాటతో 'శేఖర్'​..

రాజశేఖర్‌ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న చిత్రం 'శేఖర్‌'. బొగ్గరం వెంకట శ్రీనివాస్‌, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి 'లవ్​ గంటే' అనే పాటను జనవరి 5న సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నారు.

sekhar
'శేఖర్'

మలయాళంలో విజయవంతమైన 'జోసెఫ్‌'కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రాజశేఖర్‌ వయసు పైబడిన వ్యక్తిగా సరికొత్త లుక్‌తో సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందించారు. అను సితార, మస్కన్ సేతి హీరోయిన్లు.

కొత్త పాటతో..

ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ నటిస్తున్న చిత్రం '7 డేస్ 6 నైట్స్'. ఈ సినిమా నుంచి 'లెట్​ మీ గో దేర్'​ అనే పాట విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోహన్, కృతిక.. ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతికే ఈ సినిమా విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'పృథ్వీరాజ్'​ మళ్లీ వాయిదా..

Prithviraj Release Date: అక్షయ్​కుమార్​ నటించిన 'పృథ్వీరాజ్'​ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే పలు మార్లు విడుదల తేదీ మారుస్తూ వచ్చిన ఈ చిత్రబృందం.. ఇటీవలే అనుకున్న జనవరి 21న కూడా రిలీజ్​ చేయడం లేదని స్పష్టంచేసింది. కొత్త విడుదల తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ సినిమాలో అక్షయ్​తో పాటు మానుషీ చిల్లర్​, సంజయ్​ దత్​, సోనూ సూద్​ నటించారు. చంద్రప్రకాశ్​ ద్వివేది దర్శకత్వం వహించారు.

akshay kumar
'పృథ్వీరాజ్'

టైగర్ కొత్త పోస్టర్..

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్​ నటిస్తున్న 'హీరోపంతీ 2' చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో టైగర్​కు జోడీగా తారా సుతారియా నటిస్తోంది. సాజిద్ నదియావాలా నిర్మాత. సినిమాను ఈద్ కానుకగా ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు.

heropanti 2 release date
'హీరోపంతీ 2'

బర్త్​డే పోస్టర్​లు..

యువ నటీమణులు మాలవిళ నాయర్, వైష్ణవి చైతన్య పుట్టిన రోజు నేడు (జనవరి 4). ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ 'అన్నీ మంచి శకునములే' చిత్రం నుంచి మాళవిక, 'బేబీ' చిత్రం నుంచి వైష్ణవి పోస్టర్​లను విడుదల చేశాయి ఆయా చిత్రబృందాలు.

malvika nair
మాళవిక నాయర్​
vaishnavi chaitanya
వైష్ణవి చైతన్య

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్' వాయిదా!.. దర్శకుడి ట్వీట్ వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.