బాలీవుడ్ హిట్ సినిమా 'ఆర్టికల్ 15'.. తెలుగు రీమేక్ గురించి గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. సీనియర్ నిర్మాత సురేశ్‌బాబు.. ఈ చిత్ర హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత విక్టరీ వెంకటేశ్‌తో తీయాలని భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరో ఆసక్తికర అంశం బయటకొచ్చింది.
పరువు హత్యలకు సంబంధించిన కథతో ఈ సినిమా తీశారు. బాలీవుడ్లో చిన్న చిత్రంగానే వచ్చినా పెద్ద హిట్ సొంతం చేసుకుంది. ఇప్పుడు దీని రీమేక్‌ను అడివి శేష్ హీరోగా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అన్ని కుదిరితే త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. 'మేజర్', 'గూఢచారి 2' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు శేష్. వీటి షూటింగ్‌లు పూర్తయిన తర్వాత కొత్త ప్రాజెక్టులో నటించే అవకాశముంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">