ETV Bharat / sitara

Adivi Sesh: బాలీవుడ్​లోకి అడవి శేష్​ ఎంట్రీ! - రాధేశ్యామ్​ అప్​డేట్స్​

Adivi Sesh Bollywood: త్వరలోనే రెండు బాలీవుడ్​ చిత్రాల్లో నటించనున్నట్లు యువ కథానాయకుడు అడవి శేష్​ వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వివరాలు 'మేజర్'​ విడుదల తర్వాత చెప్తానని స్పష్టం చేశాడు.

adivi sesh
బాలీవుడ్​లోకి అడవి శేష్​ ఎంట్రీ!
author img

By

Published : Dec 3, 2021, 10:21 PM IST

Adivi Sesh Bollywood: క్షణం, గూఢఛారి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన యువ కథానాయాకుడు అడవి శేష్​. ఈ యంగ్​ హీరో ప్రస్తుం 'మేజర్' షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శేష్​కు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్​ తెలిసింది. ఇప్పటివరకు టాలీవుడ్​కే పరమితమైన శేష్.. త్వరలో బాలీవుడ్​కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని శేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

'నేను రెండు హిందీ చిత్రాల్లో నటించనున్నాను. ఇందుకు సంబంధించిన మరిన్ని వివారలు 'మేజర్​' రిలీజ్​ తర్వాత వెల్లడిస్తాను' అని శేష్​ పేర్కొన్నాడు.

26/11 ముంబయి దాడుల ఆధారంగా మేజర్​ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ కథతో 'మేజర్‌' అనే సినిమా తెరకెక్కుతోంది. టైటిల్‌ పాత్రను అడివి శేష్‌ పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్క దర్శకుడు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

డబ్బింగ్​ పూర్తి చేసుకున్న 'ప్రేరణ'

రాధేశ్యామ్​ డబ్బింగ్​ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభాస్​ సరసన పూజాహెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ పాత్ర డబ్బింగ్​ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. 2022 జనవరి 14న 'రాధేశ్యామ్​' విడుదల కానుంది.

movie updates
డబ్బింగ్​ చెప్తున్న పూజా హెగ్డే

స్కైల్యాబ్​కు రౌడీ ఆల్​ ద బెస్ట్​

సత్యదేవ్​, నిత్యామీనన్​ నటించిన స్కైల్యాబ్​ శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా లైగర్​ స్టార్​ విజయ దేవరకుండ శుభాకాంక్షలు తెలిపాడు. ట్రైలర్​ ఆసక్తికరంగా ఉందంటూ ట్వీట్​ చేశాడు.

ఇదీ చూడండి : Siddharth on ticket price: 'సినీ పరిశ్రమను వేధించడం ఆపండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.