వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న నటి అదితీరావ్ హైదరి. ఆమె నటించిన ఆంథాలజీ చిత్రం 'అజీబ్ దాస్తాన్స్'. నెట్ఫ్లిక్స్లో ఇటీవల విడుదలైంది. నాలుగు లఘు చిత్రాల సమాహారంగా తెరకెక్కిన ఈ సినిమాలో 'గిలి పుచ్చి' లఘు చిత్రంలో ప్రియ శర్మగా నటించింది అదితీ. ఉద్యోగాలు చేసే మహిళల నేపథ్యంగా సాగే కథ ఇది. 'మసాన్' చిత్ర దర్శకుడు నీరజ్ గ్వావన్ దర్శకత్వం వహించారు.
"పితృస్వామ్యం గురించి, దాని నుంచి మహిళలెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే చిత్రమిది. ఇరవై నిమిషాల చిత్రమైనా, రెండు గంటల సినిమా అయినా నటిగా నాకు రెండూ ఒకటే. పాత్ర సహజంగా వచ్చిందా లేదా అనేది ముఖ్యం" అని అదితీ చెప్పింది.