యువ కథానాయకుడు అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'మేజర్'. పాన్ ఇండియా స్థాయిలో సినిమానూ రూపొందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకక్కుతున్న 'మేజర్' సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏ+ఎస్ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఇండో-చైనా సరిహద్దుతో పాటు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనూ చిత్రీకరణ జరుపుకొంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఆయన కళ్లు బాగా ఆకర్షించాయి.. అలా 'మేజర్' తీస్తున్నాం!