ETV Bharat / sitara

అడవి శేష్​ హీరోగా 'హిట్​ 2'

author img

By

Published : Mar 20, 2021, 10:08 AM IST

మర్డర్ మిస్టరీ నేపథ్య కథతో తీయబోయే 'హిట్' సీక్వెల్​లో నటుడు అడివి శేష్ హీరోగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్​ ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి శైలేష్​ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

hit 2
హిట్​ 2

'క్షణం', 'గూఢచారి' లాంటి విభిన్న సినిమాలతో హిట్​లు కొట్టిన హీరో అడివి శేష్. ప్రస్తుతం సూపర్​స్టార్ మహేశ్​బాబు నిర్మిస్తున్న 'మేజర్' చేస్తున్నారు. 26/11 దాడుల్లో వీర మరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ బయోపిక్​ను తీస్తున్నారు.

తాజాగా ఆయన కొత్త సినిమా గురించి అప్టేడ్​ వచ్చేసింది. 'హిట్'​ సీక్వెల్​లో ఆయన నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని హీరో నాని ట్వీట్​ చేశారు. ఈ సినిమాలో క్రిష్ణ దేవ్​ పాత్రలో శేష్​ కనిపించనున్నారు. దీనికి సంబంధించి విడుదల చేసిన ఓ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. ఈ చిత్రానికి శైలేష్​ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే షూటింగ్​ ప్రారంభించబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.