లెబనాన్‌పై ఇజ్రాయెల్ డెడ్లీ అటాక్స్- ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జనం పరుగులు - israel lebanon war - ISRAEL LEBANON WAR
Israel Lebanon War Photos : లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుండటం అక్కడి ప్రజల పాలిట శాపంగా మారింది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుండటం వల్ల అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని ఉత్తర దిక్కునున్న నగరాలకు పారిపోతున్నారు. లెబనాన్ రాజధాని బీరుట్ వెళ్లే దారులన్నీ వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రజలు ఎక్కడ ఆహారం దొరికినా ముందుగానే కొనుక్కుంటున్నారు. (Associated Press)
Published : Sep 24, 2024, 7:24 PM IST