ETV Bharat / sitara

ఎనిమిదేళ్ల తర్వాత 'రాధేశ్యామ్​'తో ఎంట్రీ - simran kaur

'రాధేశ్యామ్'​ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు నటి సిమ్రన్​ కౌర్​. ఈ చిత్రంలో తన పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్​కు రీఎంట్రీ ఇస్తున్నారు.

simran kaur
సిమ్రాన్ కౌర్​
author img

By

Published : Mar 15, 2021, 6:32 AM IST

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు ముద్దుగుమ్మ సిమ్రన్‌ కౌర్‌. మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటించిన 'పోటుగాడు'లో వైదేహిగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించిన ఆమె అవకాశాలు లేకపోవడం వల్ల టాలీవుడ్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా సిమ్రన్‌ తిరిగి తెలుగు సినీ పరిశ్రమవైపు తన దృష్టి మళ్లించారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌'తో ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు.

simran kaur
సిమ్రాన్ కౌర్​

"వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం వెండితెరకు దూరం కావాల్సి వచ్చింది. కొన్నినెలల క్రితం 'రాధేశ్యామ్‌' టీమ్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఆ భారీ బడ్జెట్‌ సినిమాలో నాకో రోల్‌ ఆఫర్‌ చేశారు. పాత్ర కూడా తెలుసుకోకుండానే ఓకే చెప్పేశాను. ఆ తర్వాత రోజు హైదరాబాద్‌కు వచ్చి షూట్‌లో పాల్గొన్నాను. నా రోల్‌ ఇందులో ఎంతో కీలకమైనది. అలాంటి గొప్ప టీమ్‌తో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది" అని సిమ్రన్‌ తెలిపారు.

simran kaur
సిమ్రాన్ కౌర్​

ప్రభాస్‌ - పూజాహెగ్డే జంటగా నటిస్తున్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ కీలకపాత్రలో కనిపించనున్నారు. జులై 30న ఈ సినిమా ప్రేక్షుకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: శివరాత్రి స్పెషల్- 'రాధేశ్యామ్​' కొత్త​ పోస్టర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.