ETV Bharat / sitara

మూడో పెళ్లికి సిద్ధమైన నటి వనితా విజయ్ కుమార్ - వనిత విజయ్ కుమార్ తాజా వార్తలు

తమిళ 'బిగ్​బాస్​ 3'తో వార్తల్లో నిలిచిన వనితా విజయ్ కుమార్​ మూడో పెళ్లికి సిద్ధమైంది. విజువల్ ఎఫెక్ట్స్ నిపుణుడు పీటర్ పాల్​ను ఈనెల 27న వివాహం చేసుకోనుంది.

Actress Vanitha Vijayakumar to Marry for the third time
వనిత
author img

By

Published : Jun 18, 2020, 11:54 AM IST

సీనియర్ నటుడు విజయ్ కుమార్, సీనియర్ హీరోయిన్ మంజులల పెద్ద కూతురు వనితా విజయ్ కుమార్. ఇటీవల తమిళ 'బిగ్​బాస్​ 3'తో వార్తల్లో నిలిచిన ఈమె తాజాగా మరోసారి నెట్టింట హాట్​టాపిక్​గా మారింది. అందుకు కారణం వనిత మూడో పెళ్లికి సిద్ధమవ్వడమే.

మొదట నటుడు ఆకాష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది వనిత. ఒక కూతురు, కొడుకు పుట్టిన తర్వాత అభిప్రాయ భేదాలతో 2005లో వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం రెండేళ్లకు ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఓ కూతురు పుట్టాక అతడి నుంచి విడాకులు తీసుకుంది. కొంతకాలం పాటు కొరియోగ్రాఫర్​ రాబర్ట్​తో సహజీవనం చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా విజువల్ ఎఫెక్ట్స్ డెరెక్టర్ పీటర్ పాల్​ను ఈ నటి పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయం గురించి వనిత అధికారికంగా ప్రకటించకపోయినా ఈ నెల 27న చెన్నైలోని స్వగృహంలో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

1995లో విడుదలైన తమిళ చిత్రం 'చంద్రలేఖ'తో విజయ్‌కు జోడిగా వెండితెరకు పరిచయమైంది వనిత. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 'దేవి'లోనూ నటించి మెప్పించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.