ETV Bharat / sitara

ఆ ఎర్రగౌను తయారీకి 30 రోజులు పట్టిందా!

అసోం వేదికగా ఇటీవల ఫిలింఫేర్​ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్​ తారాగణం విభిన్న దుస్తుల్లో హాజరై కనువిందు చేశారు. నటి ఊర్వశీ రౌతేలా ఎర్ర గౌనులో వచ్చి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ మోడ్రన్​ డ్రెస్ తయారుచేయడానికి నిపుణులకు పట్టిన సమయం వింటే ఆశ్చర్యం కలిగిస్తోంది.

author img

By

Published : Feb 19, 2020, 1:04 PM IST

Updated : Mar 1, 2020, 8:09 PM IST

dress
ఈ డ్రెస్​ తయారీకి 730 గంటలు పట్టిందట!

హీరోయిన్లు అందంగా కనిపించేందుకు విభిన్న దుస్తులను, సరికొత్త ట్రెండ్‌లను ఫాలో అవుతుంటారు. అవార్డు ఫంక్షన్లకు వస్తుంటే, అందరికన్నా విభిన్నంగా కనిపించాలని, కెమెరాలన్నీ తమ చుట్టూనే తిరగాలని ఊవ్విళ్లూరుతుంటారు. అందుకు తగినట్లు తమ దుస్తులను డిజైన్‌ చేసుకుంటారు.

dress
ఈ డ్రెస్​ తయారీకి 730 గంటలు పట్టిందట!

ఇటీవల ఫిలింఫేర్​ అవార్డుల వేడుక హాజరైన నటి ఊర్వశీ రౌతేలా.. ప్రత్యేక దుస్తుల్లో కనువిందు చేసింది. అంతేకాకుండా కార్యక్రమంలో ప్రధానాకర్షణగా నిలిచింది. ఎర్ర గులాబీలను తలపించేలా డిజైన్​ చేసిన ఆ గౌనులో ఊర్వశి వావ్​ అనిపించింది. అయితే తాజాగా ఈ గౌను తయారీకి పట్టిన సమయం తెలిస్తే మాత్రం వామ్మో అనిపిస్తోంది. ఈ డ్రెస్​ తయారు చేయడానికి దాదాపు 730గంటల సమయం పట్టిందట. అంటే నెలరోజులు ఇందుకోసమే నిపుణులు పనిచేశారన్న మాట. ఈ కార్యక్రమంలో ఊర్వశీ కూర్చొన్న తర్వాత నలుగురైదుగురు సహాయకులు వచ్చి ఆమె గౌనును సరిచేయాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 2013లో 'సింగ్‌ సాబ్‌ గ్రేట్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఊర్వశి 'గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ', 'కబాలి', 'హేట్‌ స్టోరీ4', 'పాగల్‌ పంతి' చిత్రాల్లో మెప్పించింది.

ఇదీ చదవండి: లవర్స్ డే: టాలీవుడ్​లో ప్రేమికుల సినిమా సందడి

Last Updated : Mar 1, 2020, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.