తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'తుపాకి'. తమిళ, తెలుగు భాషల్లో విడుదలై.. బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో విజయ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నాను హీరోయిన్గా ఎంచుకున్నట్లు సమాచారం.
![Actress Tamannah has been selected as the heroine in the 'Thuppaki' sequel](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8634577_1.jpg)
విజయ్-తమన్నాలు కలిసి ఎస్పీ రాజ్‌కుమార్ దర్శకత్వంలో నటించిన 'సుర' చిత్రం 2010లో విడుదలైంది. దాదాపు పదేళ్ల తర్వాత మురుగదాస్ చిత్రం కోసం వీరిద్దరూ మళ్లీ కలిసి నటించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం 'మాస్టర్' చిత్రంతో బిజీగా ఉండగా.. సంపత్ నంది తెరకెక్కిస్తున్న 'సీటీమార్'లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా నటిస్తోంది తమన్నా.