ETV Bharat / sitara

అభిమాని 'ప్రేమలేఖ'కు సుస్మితాసేన్​ ఫిదా - సుస్మితా సేన్​కు ప్రేమలేఖ

అభిమాని రాసిన ప్రేమలేఖకు ఫిదా అయిన నటి సుస్మితాసేన్.. దీనిని జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పింది. ఆ విషయాన్ని ఇన్​స్టాలో పంచుకుంది.

హీరోయిన్ సుస్మితాసేన్​కు అభిమాని 'ప్రేమలేఖ'
హీరోయిన్ సుస్మితాసేన్​
author img

By

Published : Jun 27, 2020, 1:06 PM IST

బాలీవుడ్​ నటి సుస్మితా సేన్.. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ నటించింది. 'ఆర్య' వెబ్​ సిరీస్​తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులోని నటనకుగాను ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని సుస్మితాకు స్వయంగా ఓ ప్రేమలేఖను రాసి పంపించాడు. దానిని ఇన్​స్టాలో పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. అద్భుతమైన లవ్​లెటర్​ ఇదని పేర్కొంది. జీవితకాలం గుర్తుండిపోతుందని తెలిపింది.

Sushmita Sen gets handwritten love letter from fan
నటి సుస్మితాసేన్ ఇన్​స్టా పోస్ట్

"అద్భుతమైన లవ్​లెటర్. గత కొన్నేళ్ల నుంచి అభిమానుల ఆత్మీయత నాకు దక్కడం నిజంగా అదృష్టం. స్వయంగా రాసిన లేఖలు అంటే నాకు చాలా ఇష్టం. అలానే మీరు నాకు పంపే ప్రతి లెటర్​ను చదువుతాను. అయితే తొలిసారి చాలా సింపుల్​గా రాసిన ప్రేమలేఖను ఓ అభిమాని పంపారు. దీనిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఐ లవ్ యూ టూ!!!" అని ఇన్​స్టాలో సుస్మితాసేన్ రాసుకొచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.