ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో ఈ మధ్యకాలంలో బాగా నానుతున్న వార్త బంధుప్రీతి. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న తరువాత చిత్రసీమలో నెపోటిజమ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంతమంది నెటిజన్లు బాలీవుడ్ చిత్రసీమలోని నిర్మాతలు, వాళ్ల పిల్లలను సామాజిక మాధ్యమాల వేదికగా తిట్టిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో బంధుప్రీతి అనే అంశంపై నటి శ్రుతిహాసన్ స్పందించింది.
"నేను చిత్రసీమలోకి చాలా ఈజీగానే అడుగుపెట్టాను. కానీ ఇక్కడ నిలబడాలంటే మాత్రం చాలా కష్టపడాలి. నేను సినిమా కుటుంబానికే చెందిన వ్యక్తిని కావటం చేత నాకు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడానికి కష్టంగా అనిపించలేదు. నేను నిజజీవితంలో చాలా నెమ్మదిగా అంశాలు నేర్చుకునే అమ్మాయిని. ఎదుటివారితో అంత ఈజీగా కలిసిపోడం నాకు తెలియదు. వారిని ఆకట్టుకునేలా మాట్లాడ్డం అస్సలు చేతకాదు. అందుకే తొందరగా అవతలి వ్యక్తులతో స్నేహం చేయలేను. నాకు తెలిసినంత వరకు సినీ ప్రవేశం వారసులకు ఈజీగానే లభించిన, దాన్ని సాధించి, నెలబెట్టుకోవడం అంతా ఈజీ కాదు.." అని శ్రుతి చెప్పింది.
ప్రస్తుతం శ్రుతి హాసన్ తెలుగులో పవన్ సరసన 'వకీల్ సాబ్'లో అతని భార్యగా నటించనుంది. ఇక బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధమైన 'యారా'లో కథానాయికగా నటిస్తోంది. శ్రుతిహాసన్, విద్యుత్ జమ్మాల్, విజయ్‌వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. తిగ్మన్షు దులియా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. ఫ్రెంచ్ చిత్రం 'ఎ గ్యాంగ్ స్టోరీ'కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్, పాటలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. నలుగురు స్నేహితుల కథగా నేపాల్ - ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో నడిచే ఈ సినిమా.. జులై 30న ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">