వ్యక్తికి అందం కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని అభిప్రాయపడింది నటి సమంత. వయసున్న అమ్మాయిల్లో ఎవరికైనా మేకప్ వేసి.. మంచి కాస్ట్యూమ్స్ వేసి కెమెరా ముందుకు వెళితే వారు నా కంటే మరింత అందంగా కనిపిస్తారని చెబుతోంది. అందుకే అందానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వనని వెల్లడించింది.
"సమంతా నువ్వు చాలా అందంగా ఉంటావు.. క్వీన్‌లా ఉంటావు అంటుంటారు చాలా మంది. కానీ, నేనేం గొప్ప అందగత్తెని కానని చెబుతుంటా. మేకప్ చేసి, మంచి కాస్ట్యూమ్స్ వేసి కెమెరా ముందు పెడితే నా వయసున్న అమ్మాయిలంతా అందంగానే ఉంటారు. కాలేజీ రోజుల్లో అందంపై బాగా ఆసక్తి ఉండేది. రానురానూ దానిపైనున్న మోజు పూర్తిగా తగ్గిపోయింది. రెండు, మూడేళ్లు పోతే ఈ అందం, నాజూకుదనం ఏమైపోతాయో? కాబట్టి దాని గురించి నేనేం పట్టించుకోను. ప్రతి వ్యక్తికీ క్యారెక్టర్ ముఖ్యం. అది ఎప్పటికీ మారదు. అందుకే దాని గురించే ఆలోచిస్తుంటా."
- అక్కినేని సమంత, నటి