అతిథి పాత్ర మాత్రమే కాదు, మరొక సినిమా చేద్దామని మాటిచ్చిన నాగార్జున ఇంతవరకు ఏం చెప్పలేదని అంటోంది కథానాయిక రేఖ. 'ఆనందం' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ తొలి ప్రయత్నంలోనే మంచి నటిగా గుర్తింపు పొందింది. 'ఒకటో నంబరు కుర్రాడు'తో యువత హృదయాలు దోచుకుంది. ఆ తర్వాత నాగార్జున కథానాయకుడిగా వచ్చిన 'మన్మథుడు' సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించింది.
అసలు విషయం ఏంటంటే.. 'మన్మథుడు' చిత్ర షూటింగ్ సమయంలో ప్రత్యేక పాత్ర కాదు మరో సినిమా చేద్దామన్నాడట నాగ్. అయితే అప్పటి నుంచి ఈ ఇద్దరు కలిసి నటించలేదు. ఆ అవకాశం రాలేదు. "ఈ మాట ఎప్పుడో చెప్పారు. ఇప్పటి వరకు ప్రామిస్ నిలబెట్టుకోలేదు. సర్ ఇంకా వేచి చూస్తున్నా" అని నాగ్‌ని ఉద్దేశించి సరదాగా చెప్పుకొచ్చింది రేఖ.
ఇదీ చూడండి : థియేటర్లలో 'పాంచ్ పటాకా'.. ఏకంగా ఐదు సినిమాలు