కరోనాతో లభించిన సుదీర్ఘ విరామం వల్ల సినీ తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే కొంత మంది సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో చిట్‌చాట్ చేస్తుంటే.. ఇంకొందరు తమలోని ప్రతిభను బయటకు తీసి అందరితో ఆహా అనిపించుకుంటున్నారు. తాజాగా, టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గిటార్ చేత పట్టి సింగర్‌గా మారింది. 'హుషారు' సినిమాలో ఎంతో మంది సంగీత ప్రియులను ఆకట్టుకున్న 'ఉండిపోరాదే' సాడ్ వెర్షన్ పాటను ఆలపించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిందీ భామ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"పాడటం అంటే నాకెంతో ఇష్టం. నా మనసుకు స్వాంతన కలిగించేది ఇదే. తెలుగు పాటల్లో నాకెంతో ఇష్టమైన వాటిల్లో ఇది ఒకటి. ఇందులోని సాహిత్యం, ట్యూన్స్, సిధ్ శ్రీరామ్ మధురమైన స్వరం విన్నప్పుడల్లా నా ముఖంలో చిరునవ్వు విరుస్తుంది. ఇప్పుడు నేను పాడాలనుకుంటున్నా. మీతో పంచుకోవాలనిపించింది."
-రాశీ ఖన్నా, సినీ నటి
రాశీ ఖన్నా సింగర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో 'జోరు' సినిమాలో టైటిల్ సాంగ్‌ను ఆలపించి ప్రేక్షకులను మెప్పించింది. మెగా హీరో సాయి తేజ్ నటించిన 'జవాన్' చిత్రంలోనూ 'బంగారు' పాటను పాడింది రాశి.