ETV Bharat / sitara

బాలయ్య సరసన ఛాన్స్ కొట్టేసిన పూర్ణ - బాలయ్య పూర్ణ కొత్త సినిమా

నందమూరి బాలకృష్ణ సరసన కథానాయికగా సందడి చేయనుంది నటి పూర్ణ. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్​గా ఆమెను ఎంచుకుంది చిత్రబృందం.

actress purna selected as a heroine in nandamuri bala krishna new movie
నందమూరి నటసింహం సరసన పూర్ణ
author img

By

Published : Nov 3, 2020, 10:03 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు నాయికలకి చోటుంది. ఒక నాయికగా మలయాళీ భామ ప్రయాగ మార్టిన్‌ను ఎంపిక చేశారు. రెండో నాయికగా పూర్ణ అవకాశాన్ని సొంతం చేసుకుంది.

ఇటీవలే హైదరాబాద్‌లో పునఃప్రారంభమైన ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు. కొన్ని సన్నివేశాల్లో అఘోరాగా ఆయన సందడి చేయనున్నట్టు సమాచారం. బాలకృష్ణ- బోయపాటి కలయికలో 'సింహా', 'లెజెండ్‌' తర్వాత రూపొందుతున్న చిత్రమిదే.

ఇదీ చూడండి:బాలయ్య సినిమాలో నందమూరి హీరో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.