లాక్డౌన్తో సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తమకిష్టమైన వ్యాపకాల్లో బిజీగా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ, అభిమానులతో టచ్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ట్వీట్ చేసిన నటి-నిర్మాత ఛార్మి.. తన క్వారంటైన్ పార్టనర్ ఇదేనని రాసుకొచ్చింది. ఇందులో భాగంగా తన పెంపుడు కుక్కతో కలిసున్న ఫొటోను పంచుకుంది.
'రాఖీ', 'శ్రీ ఆంజనేయం', 'మాస్', 'అనుకోకుండా ఒకరోజు', 'మంత్ర' వంటి సినిమాల్లో నటించిన ఛార్మి.. గత కొన్నేళ్ల నుంచి నటనకు విరామమిచ్చి, నిర్మాతగా మారింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ కలిసి పలు చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి విజయ్ దేవరకొండతో సినిమా తీస్తున్నారు. ఇందులో అనన్య పాండే హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నారు.