ETV Bharat / sitara

'మా ఇద్దరి ఎనర్జీ లెవల్స్ కొంచెం ఎక్కువ.. అందుకే' - పూజా హెగ్డే ఎన్టీఆర్

'అరవింద సమేత' షూటింగ్​ రోజుల్ని గుర్తు చేసుకున్న నటి పూజా హెగ్డే.. తారక్​తో కలిసి నటించడాన్ని మర్చిపోలేనని చెప్పింది. త్రివిక్రమ్ వల్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం సాధ్యమైందని తెలిపింది.

actress pooja hegde about aravinda sametha movie
నటి పూజా హెగ్డే
author img

By

Published : Nov 21, 2020, 10:23 AM IST

తారక్‌తో కలిసి స్ర్కీన్‌ పంచుకోవడం అద్భుతంగా అనిపించిందని హీరోయిన్ పూజాహెగ్డే చెప్పింది. ఈ ఏడాది ఆరంభంలో 'అల వైకుంఠపురములో' చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అరవింద సమేత' సినిమా గురించి, అప్పటి అనుభవాలను పూజ పంచుకుంది.

actress pooja hegde about aravinda sametha movie
'అరవింద సమేత' సినిమాలో తారక్ పూజా హెగ్డే

త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌-పూజాహెగ్డే మొదటిసారి జంటగా నటించారు. "అరవింద సమేత'.. ఎప్పటికీ నాకు ఓ ప్రత్యేకమైన చిత్రం. ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం ఈ సినిమాతో నాకు లభించింది. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. మా ఇద్దరికీ ఎనర్జీ లెవల్స్‌ కొంచెం ఎక్కువగా ఉంటాయి. దానివల్లే ఆన్‌స్ర్కీన్‌లో మా జోడీ ప్రేక్షకులను అన్నివిధాలుగా అలరించింది. ఆన్‌స్ర్కీనే కాకుండా ఆఫ్‌స్ర్కీన్‌లోనూ ఈ చిత్రం నాకెన్నో అనుభవాలను అందించింది. దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వల్లే అరవింద పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకున్నాను' అని పూజాహెగ్డే ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంది.

ప్రభాస్ 'రాధేశ్యామ్‌'తో పాటు అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'లోనూ పూజాహెగ్డే నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.